రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. అందులో భాగంగానే పాత బస్టాండ్, నేతన్న చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఉదయం పది గంటల తర్వాత గంట వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా బయటకి వచ్చిన 50 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 2 ఆటోలను సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 204 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలను లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఇచ్చేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో కొవిడ్ నిబంధనలను పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ 51బీ కింద 2 వేల 406 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అత్యవరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చనా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్.ఐ సుధాకర్, ట్రెనీ ఎస్.ఐలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు