ETV Bharat / state

లారీలో షార్ట్​సర్కూట్​.. గన్నీ బ్యాగులు దగ్ధం - రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్న గన్నీబ్యాగులను తీసుకెళ్తున్న లారీలో షాట్​సర్క్యూట్​ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 7000 గన్నీ సంచులు అగ్నికి కాలిపోయాయి.

shortsurquite in lorry which is carried ganni bags to the grain purchasing centers at rajanna siricilla
లారీలో షార్ట్​సర్కూట్​.. గన్నీ బ్యాగులు దగ్ధం
author img

By

Published : Apr 8, 2020, 5:33 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గన్నీ సంచులతో వెళ్తున్న లారీ విద్యుదాఘాతానికి గురైంది. పట్టణంలోని పౌర సరఫరాల గోదాం నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులను తీసుకు వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్​ జరిగింది. తద్వారా గన్ని సంచులకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు ఆర్పివేశారు. లారీలో 20వేల గన్నీబ్యాగులు ఉండగా.. వాటిలో 7000 సంచుల వరకు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.