రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ బస్సు రోడ్టెక్కాయి. ఉదయం 6 గంటల నుంచే బస్సులు నిర్దేశిత ప్రాంతాలకు బయల్దేరాయి. లాక్డౌన్ నిబంధనల మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోలో బస్సులను శానిటైజ్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు.
ప్రతి ప్రయాణికుడు బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్ దగ్గర శానిటైజేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మాస్కు ధరించని ప్రయాణికులను బస్సులోకి అనుమతించడం లేదన్నారు. బస్సులో నిలుచుండి ప్రయాణించ రాదని స్పష్టం చేశారు.
లాక్డౌన్కు ముందు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జిల్లాలో చిక్కుకుపోయిన ప్రయాణికులే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో సైతం ఎడం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొదటిరోజు పూర్తిగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులనే నడిపించే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.