సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. అసత్యపు ప్రచారాలు చేసేవారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. వాటితో శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారు.. వాటిని షేర్ చేసేవారు ఆ పోస్టులు నిజమైనవా కాదా అని నిజ నిర్దరణ చేసుకోవాలని రాహుల్ హెగ్డే నెటిజన్లకు సూచించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు ఫార్వార్డ్ పోస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. శాంతి భద్రతలే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధర