ETV Bharat / state

సిరిసిల్ల పోలీసులు.. సహృదయులు - Rajanna Siricilla District Police Department Helps to orphaned children

విధుల్లో కఠినంగా ఉండటమే కాదు పరిస్థితులకు అనుగుణంగా మానవత్వాన్నీ చాటగలమని నిరూపించారు రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకి... అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఖాకీచొక్కాల మాటున స్పందించే హృదయమూ ఉంటుందనే విషయాన్ని గుర్తుచేసిన ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండలంలో చోటు చేసుకుంది

rajanna-siricilla-district-police-department-helps-to-orphaned-children
సిరిసిల్ల పోలీసులు.. సహృదయులు
author img

By

Published : Jun 4, 2020, 5:38 PM IST

కఠినమైన ఖాకీ మాటున సున్నితమైన మనసు కూడా ఉంటుందని నిరూపించారు రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు. విధి వంచనతో తల్లిదండ్రుల్ని కోల్పోయి దిక్కు తోచని స్థితిలోకి జారుకున్న ముగ్గురు పిల్లలకు... అండగా మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఇంకా పసిప్రాయాన్ని కూడా దాటని ఆ చిన్నారులకు రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని వడ్డెరకాలనీకి చెందిన గుంజె శ్రీనివాస్, పద్మ దంపతులు. సుమారు రెండేళ్ల క్రితం శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోగా.. పద్మ గత 20 రోజుల క్రితం కామెర్ల వ్యాధితో మరణించింది. దీంతో వారి ముగ్గురు పిల్లలు సంతోష్, శశి, మధుప్రియలు అనాథలుగా మారిపోయారు. చివరికి అమ్మమ్మే వారిని చేరదీసి సాకుతోంది. నివసించడానికి స్వంత ఇళ్ళు కూడా లేని దుస్థితి ఆ చిన్నారులది.

విషయం తెలుసుకున్న జిల్లా పోలీసుశాఖ వారికి ఓ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో గురువారం గృహ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. అలాగే రూ.50 వేల చెక్కు, 50 కిలోల బియ్యం, దుస్తువులను అందించారు. వారి చదువుకు సంబంధించిన సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, చందుర్తి సీఐ వెంకటేశ్, రుద్రంగి, చందుర్తి ఎస్సైలు వెంకటేశ్వర్లు, సునీల్, ఎంపీపీ స్వరూపారాణి, జెడ్పీటీసీ సభ్యుడు మీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : మావోయిస్టులకు కాంట్రాక్టర్ల సాయం, రూ.2కోట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.