రాజ్యసభ్య సభ్యుడు సంతోశ్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తన క్యాంపు కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్, నిజామాబాద్ సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేతలకు హరిత సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం, ఎంపీ సంతోశ్ కుమార్ ప్రారంభించిన హరితసవాల్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ పచ్చతోరణంగా మారుతోందని ఎస్పీ రాహుల్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత పర్యావరణాన్ని అందించిన వారమవుతామని తెలిపారు. హరితసవాల్ ద్వారా జిల్లాలోని పోలీసు కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని చెప్పారు.