రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తి సమగ్ర సమాచారాన్ని ఇకపై అధికారిక వెబ్సైట్లో పొందుపరచాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య, ట్రైనీ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్లతో కలిసి నూతనంగా రూపొందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక వెబ్సైట్ను కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లాకు సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని https://rajannasircilla.telangana.gov.in సైట్లో పొందుపరచాలని... అలాగే ఈ వెబ్సైట్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు. జిల్లా సమాచార పోర్టల్ను పరిశీలించి సిబ్బందికి మార్పులు, చేర్పులపై సలహాలు ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సమాచారాన్ని పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు.