రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్.. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేగంతోపాటు పనుల్లో నాణ్యత ఉండాలని సూచించారు. రాత్రివేళ కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు, స్థానిక నాయకులు అలర్ట్ అయ్యారు.
- ఇదీ చూడండి: ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికారులు