ETV Bharat / state

'మా భూమిని అధికార పార్టీ నేతలు కాజేశారు' - ruling party leaders

రెవెన్యూ అధికారులు నిరుపేద వ్యక్తుల భూములను కాపాడాల్సింది పోయి, అధికార పార్టీ నాయకులకు మారుస్తున్నారని ఓ కుటుంబం రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కాసులకు కక్కుర్తి పడి ఎటువంటి విచారణ చేయకుండానే ఆన్​లైన్​లో ఒకరి భూమిని మరొకరి పేరుమీద మార్పిడి చేశారని ఆరోపించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

Protest that the ruling party leaders have taken their land at rajanna sircilla district
అధికార పార్టీ నేతలు తమ భూమిని తీసుకున్నారని ఆందోళన
author img

By

Published : Sep 19, 2020, 7:21 AM IST

అధికార పార్టీ నేతలు తమ భూమిని తీసుకున్నారని ఆందోళన

తమ భూమిని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేరు మీదకు మార్చుకున్నారని ఓ కుటుంబం రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన కాంభోజి వెంకట నర్సయ్యకు 1009/సీ/2 సర్వే నంబర్​లో 20 గుంటల భూమి ఉంది.

దీంతోపాటు కొత్త పాస్​బుక్ రైతుబంధు డబ్బులు కూడా వస్తున్నాయి. అయితే వెంకట నర్సయ్య 27 జులై 2020న మరణించాడు. అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన భిన్నవేని భాగయ్య రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని మార్పిడి చేసుకున్నాడని బాధితులు వాపోయారు.

వెంకట నర్సయ్య కుటుంబ సభ్యులు రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మధును నిలదీశారు. అతను పొంతనలేని సమాధానం చెప్తున్నాడని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు సిరిసిల్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను వేడుకున్నారు.

ఇదీ చూడండి : పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.