ETV Bharat / state

వేములవాడ రెడ్​జోన్​లో ఎంపీ బండి సంజయ్​ పర్యటన - LOCK DOWN EFFECTS

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్​జోన్​లో భాజపా అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ పర్యటించారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

MP BANDI SANJAY VISITED VEMULAWADA REDZONE
వేములవాడ రెడ్​జోన్​లో ఎంపీ బండి సంజయ్​ పర్యటన
author img

By

Published : Apr 16, 2020, 2:23 PM IST

కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను ప్రతీ ఒక్కరు పక్కాగా పాటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్​జోన్ ప్రాంతంలో సంజయ్​ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

వలస కూలీల విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవటం వల్లే కూలీలు రోడ్లపైకి వస్తున్నారన్నారు. కూలీలను పోలీసులు నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేస్తున్నారని... అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

లాక్​డౌన్​కు ముందు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది సమ్మె చేపట్టారని ఇప్పుడు స్వచ్ఛందంగా విధుల్లోకి వస్తామని చెబుతున్న వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.