రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ బండి సంజయ్ భూమి పూజ చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని.. మొక్కలు నాటడమే కాక... వాటిని సంరక్షించే బాధ్యతను వహించాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా విషయంలో ప్రభుత్వానికి సమన్వయం లోపించిందని ఆయన అన్నారు. కరోనా వ్యవహారంలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారన్నారు. ఉత్తర్ప్రదేశ్, కర్ణాటకలో ఐదు లక్షలకు పైగా పరీక్షలు చేశారని.. మన రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.