కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజన్న క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రచారం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తామని రూ. 400 కోట్లు కేటాయించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలలో ఆలయం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా భాజపాను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : ఇంటిల్లిపాదిని బలితీసుకున్న మద్యం