రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు గురువారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌తో కలిసి ముస్తాబాద్ మండలంలోని మోహినికుంటలో నిర్వహించిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. గ్రామంలో సామూహిక భవనం, వైకుంఠ దామం, వ్యవసాయ గోదాములను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పల్లెప్రగతి సభలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు పూర్తి