ETV Bharat / state

రాష్ట్రంలో నీలివిప్లవం, క్షీరవిప్లవం: కేటీఆర్​ - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

రాష్ట్రంలో నీటి వనరుల పెంపుతో నీలివిప్లవం, క్షీరవిప్లవం వస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మంత్రి పర్యటించారు.

minister ktr tour in rajanna sirisilla district
రాష్ట్రంలో నీలివిప్లవం, క్షీరవిప్లవం: కేటీఆర్​
author img

By

Published : Jun 10, 2020, 12:30 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 660 చెరువులను నింపుతామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలంలో మంత్రి పర్యటించారు. కరెంట్‌ మీద ఆధారపడకుండా కాలువలతోనే పొలాలకు నీరు అందాలన్నారు. సముద్రమట్టానికి 680 మీటర్ల ఎత్తులోని ప్రాంతానికి గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడు, జలాలను కింద నుంచి పైకి తీసుకొచ్చారని ప్రశసించారు. కృష్ణా, గోదావరి నదుల మీద ప్రాజెక్టులతో 1.20 కోట్ల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల కుంటలు, చెరువులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జలకళలతో రైతులతో పాటు కులవృత్తుల వారు బాగుపడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నీటి వనరుల పెంపుతో నీలివిప్లవం, క్షీరవిప్లవం వస్తుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని జయించిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.