ETV Bharat / state

ఇళ్లైనా, పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్​ - minister ktr visit siricilla

రాష్ట్రంలో ఇళ్లైనా పెళ్లైనా కార్యక్రమాలు తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. గత పాలకులు ఒక అర్ర ఉన్న ఇళ్లను మాత్రమే కట్టించారని దుయ్యబట్టారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పేర్కొన్నారు.

minister ktr visit siricilla, ktr latest news
ఇళ్లైనా పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్​
author img

By

Published : Apr 3, 2021, 2:31 PM IST

ఇళ్లైనా పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్​

సిరిసిల్ల జిల్లాకు 6,886 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. గతంలో పేదలకు డబ్బా ఇళ్లు కట్టించి ఇచ్చారని విమర్శించారు. మూడు రంగుల ఇళ్ల కోసం.. మూడు చెరువుల నీళ్లు తాగించారని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం పేదలకు అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని కేటీఆర్​ స్పష్టం చేశారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. గత పాలకులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు మాత్రమే ఖర్చు చేశారని.. కానీ ఇప్పుడు రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నామని అన్నారు. పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండేలా ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లైనా పెళ్లైనా తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

ఇదీ చూడండి : పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండేలా ఇళ్ల నిర్మాణం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.