KTR Inaugaration Silver Saree: చేనేత కళాకారుల ప్రతిభకు పుట్టినిల్లయిన సిరిసిల్లకు చెందిన నల్లా విజయ్ తయారు చేసిన.. సువాసనలు వెదజల్లే వెండిచీరను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ చీర తయారీ కోసం సుగంధ ద్రవ్యాలు, వెండిని ఉపయోగించటంతోపాటు సుమారు నెలన్నర రోజులు శ్రమించి మగ్గంపై నేసినట్లు.. విజయ్ తెలిపారు.
![వెండి చేనేత చీరను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17426641_saree2.jpg)
ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తుల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నేతన్నల అద్భుత ప్రతిభకు విజయ్ నిదర్శనమని కేటీఆర్ ప్రశంసించారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించిన మంత్రి కేటీఆర్.. విజయ్‌కి అన్నిరకాల సహాయసహకారాలను అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: