ETV Bharat / state

బస్సు ప్రమాద బాధితులకు మంత్రి, ఎంపీ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మంత్రి ఈటల రాజేందర్​, ఎంపీ బండి సంజయ్​ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బస్సు ప్రమాద బాధితులను మంత్రి, ఎంపీ పరామర్శ
author img

By

Published : Aug 28, 2019, 8:04 PM IST

Updated : Aug 28, 2019, 8:50 PM IST

బస్సు ప్రమాద బాధితులను మంత్రి, ఎంపీ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్​, ఎంపీ బండి సంజయ్​ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంతాపాలు, పరామర్శలకే పరిమితం కాకూడదని ఎంపీ బండి సంజయ్​ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవరించాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి

Intro:TG_KRN_63_28_SRCL_ETELA_BANDI_SANJAY_PARAMARSHA_AVB_G1_TS10040_HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని బస్ డిపో వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థుల మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చరీకి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. సంఘటన వివరాలను తెలుసుకొని ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...

* మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ......

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాల బస్సుల్లో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పూర్తిస్థాయి విచారణ చేపట్టి అన్ని స్కూల్లో సైతం అనుభవమున్న డ్రైవర్లను మాత్రమే నియమించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపించి అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

* కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్ మాట్లాడుతూ...

సంఘటనలు జరిగినప్పుడే సంతాపాలు, పరామర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిరుపేద పిల్లలు మృతి చెందడం బాధాకరమన్నారు. స్కూల్ వ్యాన్లు, ఆటోలు, మినీ బస్సు లను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులు ఫిట్నెస్ , ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అని తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు. గాయాలకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. ప్రభుత్వపరంగా మృతుల కుటుంబాలను ఆదుకుంటాం అన్నారు.

బైట్: ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
బైట్: బండి సంజయ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్.
Last Updated : Aug 28, 2019, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.