వయస్సు చిన్నది ఆలోచన పెద్దది
పండించిన ధాన్యాన్ని సంచుల్లో నింపి తూకం వేయడానకి కర్షకులు పడుతున్న కష్టం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి యంత్రం తయారు చేస్తే బాగుంటుందో తీవ్రంగా అన్వేషించాడు. మనస్సులో తట్టిన ఆలోచనను తన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లుతో పంచుకున్నాడు. నలుగురు చేసే పనిని ఒక్కరే చేసే విధంగా.... పెద్దపెద్ద పరికారాల అవసరం లేకుండా 5వేల రూపాయల ఖర్చుతో చిన్న యంత్రం సిద్ధం చేశాడు. ఈ పరికరంతో.. ఒక సంచిని నింపి తూకం వేయడం 3 నిమిషాల్లోపే పూర్తవుతుంది.
అభిషేక్ రూపొందించిన యంత్రానికి జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. తమ కుమారుడి విజయంపై కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ చిన్నతనం నుంచి ప్రయోగాలంటే ఆసక్తి కనబరుస్తాడని..అంతేకాకుండా చదువులోను ఎంతో కష్టపడతాడని అతని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కితాబిచ్చారు.
ఇవీ చదవండి:'ఐదేళ్లలో అంబరమెక్కిస్తా'
కేటీఆర్ అభినందన...
అభిషేక్‌ను స్వయంగా అభినందించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక లక్ష 16వేల చెక్కు బహుమతిగా అందించారు. పేటెంట్ హక్కులు పొందేందుకు వీలుగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
చిన్ననాటి నుంచి చదువుపట్ల ఎంతో ఆసక్తి కనబరిచే అభిషేక్ తన భవిష్యత్ లక్ష్యం మాత్రం ఐఏఎస్ కావడమేనని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.