Land Expatriates Protest: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాల్వ భూసేకరణలో నిర్వాసితులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి చేరుకున్న అధికారుల వాహనాలు ముందుకు వెళ్లకుండా నిర్వాసితులు అడ్డంగా కూర్చున్నారు. చేసేదేంలేక అధికారులు కూడా మండుటెండలో భునిర్వాసితులతో పాటు కింద కూర్చుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దేశాయిపల్లిలో మొదటిసారి వరద కాల్వలో సగం గ్రామం భూసేకరణలో కోల్పోయామన్నారు.
మూడో టీఎంసీ కాల్వలో మరికొంత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ధర మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. ఇందుకు అధికారులు నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే చేపట్టేందుకు ఉపక్రమించగా నిర్వాసితులు నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: Boiled Rice Issue : 'బాయిల్డ్ రైస్ కొనేదే లేదు'.. తేల్చి చెప్పిన కేంద్రం