ETV Bharat / state

బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం.. - ktr tweet on batukamma saree reproduction

బతుకమ్మ చీరల ఉత్పత్తిని పునః ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. సిరిసిల్ల చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని మంత్రి తెలిపారు.

ktr tweet on batukamma saree reproduction
బతుకమ్మ చీరల ఉత్పత్తి పునఃప్రారంభంపై కేటీఆర్ ట్వీట్
author img

By

Published : May 12, 2020, 4:00 PM IST

Updated : May 12, 2020, 6:33 PM IST

బతుకమ్మ చీరల తయారీ మళ్లీ ప్రారంభమైంది. పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. నైపుణ్యం కలిగిన సిరిసిల్ల సోదర, సోదరీమణులు బతుకమ్మ చీరల తయారీని పున:ప్రారంభించడం గర్వకారణంగా ఉందని ఆయనన్నారు.

సిరిసిల్ల చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియలో టెక్స్ టైల్ పార్క్, అపారెల్ పార్క్ క్రియాశీలక పాత్ర పోషిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

Last Updated : May 12, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.