ETV Bharat / state

అభివృద్ధే నా కులం.. సంక్షేమమే నా మతం: కేటీఆర్ - ktr speech

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అక్కడ నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న రెడ్డి సంఘం భవనం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. పేదవారు ఏ కులంలో ఉన్నా... వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కేటీఆర్
కేటీఆర్
author img

By

Published : Jun 24, 2022, 4:50 PM IST

అభివృద్ధే ధ్యేయంగా దేశంలో తెలంగాణను అగ్ర పథాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న రెడ్డి సంఘం భవనం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. పేదవారు ఏ కులంలో ఉన్నా... వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 8ఏళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు కులమతాల గురించి ఎక్కువ తెలియదని.. అభివృద్దే కులం, సంక్షేమమే మతమని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల కోసం రైతుబీమా, రైతుబంధు ఇలాంటి పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని స్పష్టం చేశారు. ఏ కారణం చేతనైనా.. రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోసం.. నానా తిప్పలు పడ్డామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక.. 24 గంటలు కరెంటు ఇస్తున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ సర్కార్‌ అని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి.. కేవంల ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధ్య‌మైందని మంత్రి అన్నారు.

కేసీఆర్ రైతుబిడ్డ.. అందుకే రైతులకు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఈనెల 28నుంచి రైతుబంధు జమ అవుతుంది. సిరిసిల్ల జిల్లా అభివృద్ధి చెందుతోంది. భూగర్భజలాలు సైతం పెరిగాయి. మెడికల్ కళశాల నిర్మించుకోబోతున్నాం. ఈ ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రి పదవి వచ్చింది. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రతి కుల సంక్షేమానికి పాటుపడుతా.. - కేటీ రామారావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

ఇదీ చూడండి: స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్‌-2కి సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.