ETV Bharat / state

'మాకు రహస్య అజెండా లేదు.. రైతులకు లబ్ధిచేయడమే లక్ష్యం' - రైతులందరికీ రైతుబంధు వస్తుందన్న మంత్రి కేటీఆర్​

రాష్ట్రంలో ప్రతిరైతుకు రైతుబంధు అందుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నియంత్రిత సాగులో ప్రభుత్వానికి రహస్య అజెండా లేదని తెలిపారు. జలవిప్లవం పునాదిగా రాష్ట్రంలో మరో నాలుగు విప్లవాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ktr said Four more revolutions besides water revolution
'జలవిప్లవానికి తోడు మరో నాలుగు విప్లవాలు'
author img

By

Published : Jun 19, 2020, 8:59 PM IST

'జలవిప్లవానికి తోడు మరో నాలుగు విప్లవాలు'

రాష్ట్రంలోని అన్నదాతలందరికీ రైతుబంధు అందిస్తామని... దీనిపై ఎలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. మద్దతు ధర లభించే లక్ష్యంతోనే నియంత్రిత సాగు తీసుకువచ్చామని... ప్రభుత్వానికి ఎలాంటి రహస్య అజెండా లేదని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వ సభ్యసమావేశంలో పాల్గొన్న కేటీఆర్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కలిగించారు.

జనహితం-జలహితం

సిరిసిల్లో మంత్రి కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. గంభీరావుపేట మండలం కొల్లమద్దిలో జనహితం-జలహితం కార్యక్రమంలో భాగంగా ఎగువ మానేరు ఫీడర్ ఛానెల్‌లో పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం నర్మాలలో మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్​ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి రోజుకు ఏమేర కూలి గిట్టుబాటు అవుతుందో అడిగి తెలుసుకున్నారు. కరోనా అంటే భయపడ్డవద్దని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు సూచించారు.

రైతుబంధు సక్రమంగా అందేలా

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన కేటీఆర్ నియంత్రిత సాగు సహా వివిధ అంశాలపై అవగాహన కలిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో రాష్ట్రంలో జలవిప్లవం వచ్చిందని... దీని పునాదిగా మరో నాలుగు విప్లవాలు రాబోతున్నాయని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చేందుకు నియంత్రిత సాగు విధానం తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతుబంధు సక్రమంగా అందేలా క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్న ఆయన... తప్పుడు ప్రచారాలు చేసే వారికి దీటుగా సమాధానమివ్వాలని సూచించారు. వర్షాకాలం సాగుకు నీళ్లు, ఎరువులు, విత్తనాలతోపాటు అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఎంపీపీలు, జడ్పీటీసీలు సహా ఇతర మండల అదికారులు మండలంలోని వ్యవసాయ పరిస్థితులపై కేటీఆర్​కు వివరించారు. రైతులకు నచ్చచెప్పి ప్రభుత్వ విధానాలపై అవగాహన కలిగించాలని వారికి సూచించారు.

ఇదీ చూడండి : 'కరోనా పారిపోవాలంటే.. హరితహారం చేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.