ETV Bharat / state

KTR visits manair victims: మానేరు మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం

సిరిసిల్ల జిల్లా మానేరు మృతుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్​ (KTR) రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్‌... వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

KTR
KTR
author img

By

Published : Nov 17, 2021, 7:11 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను మంత్రి కేటీఆర్ (KTR) పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో(exgratia for manair deaths family) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన చెక్‌ డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఆరుగురు నీట మునిగి చనిపోయారు. విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్‌... వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెక్‌ డ్యాం వద్ద చర్యలు తీసుకుంటామన్నారు.

మానేరు మృతుల కుటుంబాలకు కేటీఆర్‌ పరామర్శ.. 5 లక్షల పరిహారం

ఏం జరిగిందంటే..

విద్యార్థులంతా తామూ గతంలో చదివిన తమ కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం జరిగిన బాలల దినోత్సవంలో కలుసుకున్నారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకుంటామని బయటకొచ్చారు. వీరంతా ఒక చోట చేరారు. అప్పుడే మానేరు వాగులోకి వెళ్దామని నాలుగు సైకిళ్లపై తొమ్మిది మంది బయలుదేరారు. వాగులోకి వచ్చాక ఈత రాకపోయినా నీటిలోకి దిగారు. ఆరుగురు ఒకేసారి నీటమునిగారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌ చెక్‌డ్యాం వద్ద సోమవారం జరిగిన ఈ ఘటన ఆరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కొలిపాక గణేష్‌ (15), వెంకట సాయి(14), రాకేశ్‌ (12), క్రాంతి (14), అజయ్‌ (13), మనోజ్‌ (16) మృతి చెందారు. గణేష్‌ మృతదేహం సోమవారం లభ్యం కాగా, మంగళవారం నలుగురివి వెలికితీశారు. మనోజ్‌ మృతదేహం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బ్రిడ్జి వద్దకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని ఇవాళ వెలికి తీశారు.

ముగ్గురి సమాచారంతో...

ఆరుగురు పిల్లలు నీటిలో దిగగా.. మరో ముగ్గురు వాసాల కల్యాణ్‌, కోట అరవింద్‌, దిడ్డి అఖిల్‌ బయటే ఉన్నారు. తమతోటి మిత్రులు నీటిలో మునిగిపోవడంతో ఆందోళనకు గురై పరుగు పరుగున కాలనీకి వచ్చారు. వీరిచ్చిన సమాచారంతోనే కాలనీవాసులకు ప్రమాద ఘటన గురించి తెలిసింది.

పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన నాడే...

సోమవారం నాడు వెంకట సాయి, మంగళవారం క్రాంతి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. ఇద్దరూ ఒకేసారి మృతి చెందడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంతో జరుపుకోవాల్సిన వేడుకలరోజునే అందరిని దుఃఖసాగరంలో ముంచేశారు.

హెచ్చరిక బోర్డులు లేకనే...

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు వాగులో నిరంతరం నీరు ప్రవహిస్తోంది. చెక్‌డ్యాంల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరదలకు చెక్‌డ్యాం కొట్టుకుపోవడంతో అక్కడ నేల కోతకు గురైంది. ఇక్కడికి వచ్చే సరికి నీటి ప్రవాహ వేగం పెరుగుతోంది. దీనికి తోడు సిమెంటు దిమ్మెలు ఉన్న చోట సుడులు తిరుగుతోంది. లోతైన ప్రాంతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గండి పడ్డ చెక్‌డ్యాం పైన ఇనుప చువ్వలు తేలి ఉన్నాయి. నీటిపారుదలశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి.

సంబంధిత కథనాలు : మానేరు చెక్‌డ్యామ్‌లో ఐదుగురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.