రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. కందికట్కూరు నుంచి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. మిడ్‌మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరడం వల్ల తమ ఇళ్లు అన్ని తేమగా మారి గోడలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి : 'మా ఊరును ముంపు గ్రామంగా ప్రకటించండి'