పురపాలిక ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్... సిరిసిల్లలో ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను... రాష్ట్ర సర్కారు ఖర్చు చేసి... తామే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు.
తెరాస సర్కారు ఖర్చు చేసిన నిధులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి: పండుగకు ఊరెళితే... ఇళ్లను గుళ్ల చేశారు..!