ETV Bharat / state

KTR on Crop Damage: 'అధైర్యపడొద్దు.. దెబ్బతిన్న ధాన్యం మొత్తాన్ని కొంటాం'

author img

By

Published : May 2, 2023, 6:28 PM IST

KTR Comments at Sircilla Tour: అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం మొత్తం కొంటామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అధైర్య పడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నదాతలకు భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన కేటీఆర్‌.. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మోదీని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

KTR
KTR

KTR Comments at Sircilla Tour: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం మొత్తం కొంటామని హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఉదయం ముస్తాబాద్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్.. గోపాలపల్లిలో రైతులను అడిగి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న ఆయన... దెబ్బతిన్న పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మాట్లాడిన కేటీఆర్... ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

'సీఎం కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం పేదల కోసమే. నీళ్లు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో అధిక వరి సాగు. బీఆర్​ఎస్ అంటే రైతు ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతు బీమా, విద్యుత్‌ ఇచ్చారు. ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని కర్ణాటకలో మోదీ చెప్పారు. మోదీ దేశానికి ప్రధానియా.. కర్ణాటకకు మాత్రమే ప్రధానియా ? అదానీ ఎయిర్‌పోర్టు కొనుగోలుపై జీఎస్టీ ఎందుకు ఉండదు. పేదలు కొనే పాలు, పెరుగుపై జీఎస్టీ వేసిన ఘనుడు మోదీ.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

కేసీఆర్​పై నమ్మకం ఉంచండి: రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారన్నారు. కేసీఆర్​పై నమ్మకం ఉంచండన్న ఆయన... హెక్టార్​కు రూ. 25 వేలు, ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. సివిల్ సప్లై ద్వారా 7.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న కేటీఆర్.. గత ఏడాది కంటే ఈసారి ఇప్పటికే ఎక్కువ కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ: అంతకుముందు ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ తగిలింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతూ మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు యత్నించారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.