ETV Bharat / state

గుజరాత్‌ కంటే తెలంగాణలోనే ఆశా వర్కర్లకు అధిక వేతనాలు: కేటీఆర్

KTR Sircilla Tour Update: వీలైనంత త్వరలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో నేడు పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి.. పారిశ్రామికాభివృద్ధితో పాటు సంక్షేమంలోనూ తెలంగాణను మొదటి స్థానంలో నిలిపామని స్పష్టం చేశారు. పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసే ప్రభుత్వం కావాలంటే మళ్లీ బీఆర్​ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలని.. మతం పేరు, చరిత్ర పేరుతో ఓట్లు అడిగేవారి మాటలు నమ్మొద్దని సూచించారు.

KTR
KTR
author img

By

Published : Mar 6, 2023, 5:39 PM IST

Updated : Mar 6, 2023, 5:52 PM IST

KTR Sircilla Tour Update: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోటీ 10లక్షల నిధులతో నిర్మించిన షాదీఖానా భవనం, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రూ.20లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూంను ప్రారంభించారు. విద్యార్థుల ప్రదర్శనలు తిలకించిన అనంతరం వారిని అభినందించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు పల్లె , బస్తీ దవాఖానా, హెల్త్‌ ప్రొఫైల్‌, కేసీఆర్‌ కిట్‌ వంటి వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. దేశంలో అత్యధికంగా ఆశాలకు జీతాలిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటోందన్నారు. కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్నా పెంచలేకపోయామన్నారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామన్నారు. పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసే ప్రభుత్వం కావాలంటే మళ్లీ బీఆర్​ఎస్ పార్టీనే అధికారంలోకి రావాలని.. మతం పేరు, చరిత్ర పేరుతో ఓట్లు అడిగేవారి మాటలు నమ్మొద్దని కేటీఆర్ సూచించారు.

'గుజరాత్‌ కంటే తెలంగాణలోనే ఆశా వర్కర్లకు అధిక వేతనాలు. సంఘాలు రెచ్చగొడితే.. ఆశా వర్కర్లులు ఒక్కసారి ఆలోచించాలి. ఆర్థిక స్థితి కుదుటపడగానే ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతాం. కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి. వీలైనంత త్వరలో వారి జీతాలు పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించటం కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో షాదీ ఖానాను ప్రారంభించిన కేటీఆర్.. కులం పేరు, మతం పేరుతో విభజించి రాజకీయాలు చేసే అలవాటు కేసీఆర్​కు లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై ఏటా లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఓవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వివిధ రకాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

గుజరాత్‌ కంటే తెలంగాణలోనే ఆశా వర్కర్లకు అధిక వేతనాలు: కేటీఆర్

ఇవీ చదవండి:

Last Updated : Mar 6, 2023, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.