ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. నగదు రూ.86.28 లక్షలు, బంగారం 284 గ్రాములు, వెండి 6 కిలోల 700 గ్రాములు భక్తుల నుంచి వచ్చినట్లు అధికారుల తెలిపారు. హుండీల లెక్కింపులో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, సేవా సంఘాల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'రాహుల్ పోటీ చేయకుండా నిషేధించాలి'