సోమవారం పర్వదినం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ఆలయంలోని ఆర్జిత సేవలు, శీఘ్ర దర్శనాలు రద్దు చేశారు. రద్దీ కారణంగా దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది.
ఇవీ చూడండి :జాతీయ పార్టీలు విఫలం: కేటీఆర్