ETV Bharat / state

'ఇళ్ల నిర్మాణం మూడు రోజుల్లో పూర్తి చేయాలి' - రాజన్న సిరిసిల్ల తాజా వార్త

రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంటలో అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​ పరిశీలించారు.

house constuction works in rajanna sirisilla
'ఇళ్ల నిర్మాణం మూడు రోజుల్లో పూర్తి చేయాలి'
author img

By

Published : Dec 18, 2019, 3:34 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని అనంతగిరి ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ గుత్తేదారులను ఆదేశించారు. అనంతగిరి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 109 ఇళ్ల నిర్మాణ ప్రగతిని, కాలనీలో చేపడుతున్న మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎన్ ఖీమ్యా నాయక్, మండల అధికారి శ్రీనివాస రావులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతిని పరిశీలించారు.

ఇళ్లు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. కాళేశ్వరం జలాలు అతి త్వరలో అనంతగిరి ప్రాజెక్టులోకి రానున్నందున ఇళ్ల నిర్మాణ పనులు మౌలిక వసతులు పూర్తి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ఇంజినీరింగ్ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని సదుపాయాలతో కాలనీ ఏర్పాటు చేస్తేనే వెళ్లడానికి అంగీకరిస్తామని అనంతగిరి గ్రామస్థులు స్పష్టం చేశారు.

'ఇళ్ల నిర్మాణం మూడు రోజుల్లో పూర్తి చేయాలి'

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

TG_KRN_553_17_ELLANIRMANAM_POORTHICHEYALI_COLLECTOR_AVB_TS10084 REPORTER TIRUPATHI PLACE MANAKONDUR CONSTANCY MOBILE NUMBER 829 720 8099 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి ఆర్ అండ్ ఆర్ కాలనీ లో జనరల్ అవార్డీ ల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ గుత్తేదారులను ఆదేశించారు. అనంతగిరి ప్రాజెక్టు జనరల్ అవార్డీ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 109 ఇళ్ల నిర్మాణ ప్రగతినీ, కాలనీలో చేపడుతున్న మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ వెంకటరామ రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ ఎన్ ఖీమ్యా నాయక్, రాజస్వ మండల అధికారి శ్రీ శ్రీనివాస రావు లతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రగతిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఇళ్లు, ప్రధాన, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, విద్యుత్ ,త్రాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చొరవ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం జలాలు అతి త్వరలో అనంతగిరి ప్రాజెక్టులోకి రానున్నందున ఇళ్ల నిర్మాణ పనులు మౌలిక వసతులు పూర్తి చేసేందుకు పకడ్బందీ కార్యచరణ ప్రణాళిక తో ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ.. అన్ని సదుపాయాలతో కాలనీ ఏర్పాటు చేస్తేనే వెళ్లడానికి అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.