ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే.. పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం న్యాయమూర్తి స్వీకరించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి: తెలంగాణకు సముచిత న్యాయం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్