ETV Bharat / state

మూసధోరణి వీడి సాంకేతికత బాటలో సిరిసిల్ల నేతన్నలు

చేనేత ఖిల్లాగా ఉన్న సిరిసిల్ల ఇప్పడు ప్రయోగాలకు నెలవుగా మారుతోంది. కేవలం మూస ధోరణిలో కాకుండా సరికొత్త వస్త్రాల ఉత్పత్తితో ప్రత్యేకంగా నిలుస్తోంది. చేనేత నుంచి మరమగ్గాలకు మారిన ఇక్కడి కార్మికులు... ఇప్పుడు మరింత ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. సరికొత్త పద్దతిలో ఎలక్ట్రానిక్ జాక్వర్డ్‌ మగ్గంతో వస్త్రతయారీకి శ్రీకారం చుట్టారు.

siricilla hand loom Weavers transforming to technology path
మూసధోరణి వీడి సాంకేతికత బాటలో సిరిసిల్ల నేతన్నలు
author img

By

Published : Jun 29, 2020, 7:25 AM IST

ఒకప్పుడు రోజంతా కష్టపడి నేసిన చీరలు అమ్ముడుపోక, వాటి నిల్వలు ఇళ్ళల్లో కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయేవి. చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కక, నేసిన వస్త్రాలను విక్రయించుకోలేక... దిక్కుతోచని స్థితిలో జీవన్మరణ పోరాటం చేసేవారు. అలసిపోయిన దేహాలతో... చివరికి వాటినే ఊరి తాళ్లుగా మార్చుకొని బలవన్మరణానికి పాల్పడిన దీన దుస్థితి ఆనాటి సిరిసిల్ల నేతన్నలది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు సమయం మారింది... విధానం మారింది. మారుతున్న సమాజంతో పాటు నేత కార్మికులూ మారుతున్నారు. సరికొత్త ఆధునికతను అందిపుచ్చుకుంటూ... కాలంతో పాటు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

సిరిసిల్ల నేతన్నలు ఆధునికతను అందిపుచ్చుకుంటూ... తమ కళను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సరికొత్త పద్ధతిలో వస్త్ర సోయగాలు అందిస్తూ అబ్బురపరుస్తున్నారు. సిరిసిల్ల అంటే పాలిస్టర్‌, కాటన్ మాత్రమే ఉత్పత్తి చేస్తారనే అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరమగ్గాలపై సరికొత్త ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నారు. ఎలక్ట్రానిక్‌ జాక్వర్డ్‌ యంత్రంతో సరికొత్త వస్త్ర సోబగులతో ఔరా అనిపిస్తున్నారు.

సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్‌ ఎలక్ట్రానిక్ జాక్వర్డ్‌ మరమగ్గంతో వస్త్రతయారీకి శ్రీకారం చుట్టారు. సరికొత్త డిజైన్లతో వస్త్రాలను రూపొందించడమే కాకుండా... తన ప్రత్యేకతను దేశవిదేశాలకు విస్తరింపజేస్తున్నారు. బెంగళూరులో జాక్వార్డ్‌ యంత్ర వినియోగంపై శిక్షణ పొంది... సిరిసిల్లలో ఆధునిక పద్ధతిలో వస్త్ర ఉత్పత్తితో ఆకట్టుకుంటున్నారు.

సంప్రదాయ పద్దతిలో మరమగ్గంపై బట్ట తయారు చేస్తే... కేవలం ఒకే డిజైన్ సాధ్యమౌతుందని... అదే జాక్వర్డ్‌తో ఐతే ఏ రకమైన డిజైన్‌లోనైనా వస్త్రాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వెల్ది హరిప్రసాద్‌ వివరిస్తున్నారు. సాధారణంగా 7నుంచి 8 మరమగ్గాలు నడిపితే గానీ... రోజుకు ఒకరికి రూ.700-800 కూలీ గిట్టుబాటు అవదు. కానీ ఈ జాక్వర్డ్‌ యంత్రంతో ఒకే మగ్గం ద్వారా రూ.800 సంపాదించవచ్చని చెబుతున్నాడు.

సిరిసిల్లలో తొలిసారి నెలకొల్పిన జాక్వర్డ్‌ మగ్గంతో ఔత్సాహికులకు వస్త్రోత్పత్తిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ యంత్రంతో ఒకప్పటి సిరిసిల్లకు... ఇప్పటి సిరిసిల్లకు చాలా వ్యత్యాసం ఉందని స్థానికులు అంటున్నారు. జాక్వర్డ్‌ మగ్గంపై మరింత శిక్షణ అందిస్తే... కంచి, ధర్మవరం తరహాలో చీరలు ఉత్పత్తి చేసేందుకు వీలు కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : రేపు అవిభాజ్య నల్గొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.