రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పంట పొలాలు, వ్యవసాయ సామాగ్రి, గడ్డివాములు దగ్ధం అయ్యాయి. చందుర్తి శివారులో గల పొలాల వద్ద చెలరేగిన మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. పలువురు రైతులకు చెందిన గడ్డివాములు, అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
ఇవీ చూడండి: మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటి ముట్టడికి యత్నం