ఇరువురు పీకలదాకా మద్యం సేవించారు... అప్పటిదాకా బాగానే ఉన్నా ఆ ఇరువురికి అంతలోనే మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటూ గొడవకు దిగారు. మద్యం మత్తులో ఒకరినొకరు తోసుకున్నారు. ఇరువురిలో ఒక తాగుబోతు పట్టలేని కోపంతో మరొక తాగుబోతు కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికి సగ భాగం కిందపారేశాడు.
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం వెనుక భాగంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: బోర్ వెల్ విషాదం... బాలుడికి అంత్యక్రియలు