రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లను పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ గ్రామంగా తయారు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామపంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిజిటలైజేషన్ కోసం కావాల్సిన పరికరాలను కంటైనర్లలో మూడు క్యాబిన్లను ఏర్పాటు చేశారు. హెల్త్ సెంటర్ క్యాబిన్లో ఈసీజీ, బీపీ, షుగర్ ఇతర వైద్య పరీక్షలకు సంబంధించిన సామాగ్రి ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ-పంచాయతీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు ధ్రువపత్రాలతో పాటు, ఇంటి నిర్మాణ అనుమతులు, జనన, మరణ ధ్రువపత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్స్, లేఅవుట్ అనుమతుల లాంటి అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. తమ గ్రామంలో అమలు చేస్తున్న సేవల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : యూట్యూబ్లో మాతృభాషకే వీక్షకుల జై!