ETV Bharat / state

"ధరణి" ఆకలి తీరుస్తోంది.. - ధరణి

ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం అందించడం కంటే పుణ్యమేముంటుంది.  ఇందుకోసం లక్షలాదిరూపాయలు వెచ్చించనవసరం లేదు. వృథా అవుతున్న ఆహారాన్ని అవసరమైన వారికి అందిస్తే చాలు. ఈ సంకల్పంతోనే ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ధరణి స్వచ్ఛంద సంస్థ సభ్యులు.

"ధరణి" ఆకలి తీరుస్తోంది
author img

By

Published : Feb 22, 2019, 9:30 AM IST

"ధరణి" ఆకలి తీరుస్తోంది..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమంలోనైనా ఆహార పదార్థాలు మిగిలితే వృథా చేయకుండా తనకు సమాచారం అదించాలంటూ... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఓ సాదాసీదా అంగన్​వాడీ ఉద్యోగిని వింద్యారాణి. ఆహరం మిగిలిపోయిందని ఒక్కఫోన్​ చేస్తే చాలు నిమిషాల్లో వచ్చేస్తారు ఆ సంస్థ సభ్యులు. ఇందుకోసం ధరణి పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా ఆటోను, వంట సామాగ్రిని ఏర్పాటుచేసుకున్నారు. ఈ పదార్థాలను తీసికెళ్లి సిరిసిల్లలోని కార్మికవాడల్లో పేదలకు పంచుతూ ఆకలి తీరుస్తున్నారు.ఇద్దరితో మొదలై2004 లో ధరణి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినప్పుడు రాణితోపాటు ఆమె భర్త మాత్రమే సభ్యులు. ఇప్పుడు సుమారు 50 మందికి పైగా సభ్యులున్నారు. ఆహారం అదించడమే కాకుండా విద్యార్థులకు ఆర్థికసాయం, వివాహాలకు చేయూతనిస్తున్నారు. వింద్యారాణి సేవలను గుర్తించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018లో రూ. 51వేల నగదు బహుమతి అందించారు.

సొంతవాళ్లే పట్టించుకోని రోజుల్లో ఇతరుల ఆకలిని గుర్తించి వారికి సాయం చేస్తున్న వింద్యారాణిని అందరూ అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి'తెలుగు వెలుగు'కు ప్రశంస

Intro:TG_NLG_81_21_Santhu_sevalal_Jayanti_ab_c11

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గిరిజనులు ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి సంతు సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు జరిగిందన్నారు గిరిజనులపై కేసీఆర్ గారికి ఎనలేని ప్రేమ ఉందని అందుకే జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో అత్యధికంగా గిరిజనుల సర్పంచులు గా ఉన్నారని ప్రతి తండా గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత గిరిజనులకే అప్పజెప్పాలని ఉద్దేశంతో తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగిందన్నారు అంతరించిపోతున్న గిరిజన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజన సోదరులపై ఉందన్నారు.

బైట్............. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు.

Body:నల్లగొండ జిల్లా

Conclusion:మిర్యాలగూడ పట్టణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.