ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సోమవారం పోటెత్తారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలతో ఆలయ అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనం అమలు చేశారు.

భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య నెలకొంది.
ఇదీ చదవండి: వైరస్‌లను పసిగట్టేలా... వ్యాధుల పనిపట్టేలా!