
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ(VEMULAWADA) శ్రీ రాజరాజేశ్వర స్వామి(Sri Raja Rajeshwara temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

శ్రావణం మాసాన్ని పురస్కరించుకొని బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలాఉండగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కరోనా వేళ నిబంధలను ఎవరూ పాటించడం లేదు. ఎక్కడా భౌతిక దూరం పాటించలేదు.
ఇదీ చదవండి: Beauty Tips: అందం, ఆరోగ్యం మీ సొంతం కావాలా.. అయితే బాగా తినాల్సిందే!