రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన మసర కంటి అజయ్ (15).. మండపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో జెండా ఎగురవేశారు.
అయితే ఆదివారం సాయంత్రం తీయవలసిన జెండా పైపును, సోమవారం రోజు ఉదయం అటెండర్ శ్రీనివాస్, అజయ్ ఇద్దరు కలిసి తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అజయ్ అక్కడక్కడే మృతిచెందాడు. శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. స్కూల్ వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాడనుకున్న కుమారుని మృతిని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు