కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి ఆరోపించారు. నిత్యావసర సరకులు సైతం కొనుగోలు చేయలేని స్థితికి దిగజార్చిందని విమర్శించారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ