కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచి ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్‌కు సిద్ధం చేయాలని సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్, టన్నెల్, పంప్‌హౌస్ పనులు... కలెక్టర్ కృష్ణభాస్కర్, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. మధ్యమానేరు నుంచి 12కిలోమీటర్ల సొరంగ పనులు పూర్తి కాగా... మరో 25 మీటర్లు మాత్రమే మిగిలి ఉందని, 7కిలో మీటర్ల లైనింగ్ పనులు కూడా పూర్తి చేశారు.
టన్నెల్ లోపల పనులు వేగం మరింత పెంచి రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ రెండో వారంలోపు ట్రయల్ రన్ పూర్తి చేసి మధ్యమానేరు నుంచి నీటిని తరలించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. మల్కపేటలో నిర్మిస్తున్న సొరంగం, టన్నెల్, సర్జిపూల్ మోటార్లను క్షేత్రస్థాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి పరిశీలించడమే కాకుండా గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: 'బయటి కంటే ఇంట్లోనే మహిళలకు ఎక్కువ హింస'