ETV Bharat / state

వారి త్యాగం మరువలేనిది: ఎమ్మెల్యే సుంకే రవి - choppadandi mla meeting with collector Krishna bhaskar

మధ్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలను చర్చించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి, కలెక్టర్​తో భేటీ అయ్యారు. మధ్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

choppadandi  mla  meeting with  collector Krishna bhaskar
వారి త్యాగం మరువలేనిది: ఎమ్మెల్యే సుంకే రవి
author img

By

Published : Dec 24, 2020, 5:51 PM IST

మధ్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్​ను చొప్పదండి ఎమ్మెల్యే కోరారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్​లో పాలనాధికారితో భేటీ అయిన ఎమ్మెల్యే .. మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలని కలెక్టర్​కు తెలిపారు. ముంపు బాధితుల బాధితుల త్యాగం మరువలేనిదని తెలిపిన ఎమ్మెల్యే.. వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

ఆదేశాలు వచ్చిన వెంటనే..

ఈ భేటీలో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. మధ్య మానేరు నిర్వాసితుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఆర్డీఓ శ్రీనివాస రావు, ముంపు గ్రామాల నిర్వాసితుల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఆగని అన్నదాత ఆందోళన- చట్టాల రద్దే ధ్యేయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.