రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మను పేర్చారు. వీధుల్లో ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. పట్టణంలోని మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అధిక మాసం కావడం వల్ల వచ్చేనెల 17 నుంచి బతుకమ్మ పండుగను కొనసాగించనున్నారు.

ఇదీ చదవండి: ఓరుగల్లులో వైభవంగా బతుకమ్మ వేడుకలు