ETV Bharat / state

Bandi Sanjay: 'హుజూరాబాద్​ ఎన్నికల కోసమే.. ఇద్దరు సీఎంల హై డ్రామా!' - bandi sanjay speech water disputes

కృష్ణా జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)​ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్​ అని ధ్వజమెత్తారు. అపెక్స్​ కౌన్సిల్​ సమావేశాలకు కేసీఆర్​ ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. వేములవాడలో నిర్వహించిన భాజపా దళిత మోర్చా సమావేశంలో... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : Jul 16, 2021, 7:11 PM IST

Updated : Jul 17, 2021, 11:32 AM IST

కృష్ణా జలాల(water disputes) వివాదంపై సీఎం కేసీఆర్.. తన వైఖరి స్పష్టంగా చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)​​ డిమాండ్​ చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయటపడుతుందని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమీషన్ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన భాజపా దళిత మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్​, కేసీఆర్​లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కమీషన్ల కోసమే

రాష్ట్రానికి రావాల్సిన నీటి విషయంలో కేసీఆర్​ పట్టించుకోవడం లేదని.. అందుకే జగన్​ దోచుకుపోతున్నారని బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం కేసీఆర్​.. పక్క రాష్ట్రంతో కుమ్మకయ్యారని.. వారి వాటా విషయం తాము బహిరంగంగా చెబుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు వేస్తే ట్రైబ్యునల్ ఎలా​ ఏర్పాటు చేస్తారని అన్నారు. అపెక్స్​ కౌన్సిల్​ ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ.. సీఎం కేసీఆర్​ ఎందుకు పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

'రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారు బయటపడుతుంది. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం ఇరు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారు. జలవివాదాలపై కేంద్ర జలశక్తి నిర్ణయం.. ఏ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాదు. ఓ వైపు రాష్ట్రం నుంచి జగన్​ నీటిని దోచుకుపోతుంటే.. సీఎం కేసీఆర్​ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అపెక్స్​ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు ఎలా ఒప్పుకున్నారో చెప్పాలి.'

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు

తెలంగాణకు అన్యాయం జరిగితే భాజపా అండగా ఉంటుందని బండి సంజయ్ (Bandi Sanjay)​ హామీ ఇచ్చారు. పునర్విభజన హామీలు ఉల్లంఘించి రెండు రాష్ట్రాల సీఎంలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు హైడ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు. 2015లో అప్పటి మంత్రులు, అధికారుల ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం జరిగిందని చెప్పారు. ఆ సమావేశంలో 299 టీఎంసీల నీటి కేటాయింపునకు కేసీఆర్​ ఒప్పుకున్నారని వివరించారు.

కేసీఆర్​, జగన్​లపై బండి సంజయ్​ విమర్శలు

బహిరంగంగా చెప్పాలి

తెలంగాణలో 68 శాతం కృష్ణా పరీవాహక ప్రాంతం ఉంటే 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. వీటికి సమాధానాలు సీఎం బహిరంగంగా చెప్పాలని డిమాండ్​ చేశారు. గోదావరి, కృష్ణా జలాలపై ప్రాజెక్టులు కట్టవద్దని చెప్పడం లేదని.. కేవలం అనుమతులు తీసుకోవాలని కేంద్రం అంటుందని చెప్పారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను కాపలా పెడితే నీళ్లు ఆగుతాయా అని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: REVANTH: ప్రగతి భవన్​ గోడలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి విముక్తి కలిగిద్దాం'

Last Updated : Jul 17, 2021, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.