అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కరోనా నివారణ వ్యాప్తిలో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ సూచించారు. తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళ, పలువురు అంబేడ్కర్ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500