ETV Bharat / state

ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య... తండ్రికి కేటీఆర్​ ఫోన్​ - కరీంనగర్​ జిల్లా వార్తలు

Young man committed suicide in Sircilla: ప్రతి నిరుద్యోగి ఉద్యోగం రావాలని చాలా కష్టపడతారు. జాబ్ వస్తే భవిష్యత్తులో ఆనందంగా జీవించవచ్చు అనుకొని ప్రస్తుత జీవితంలో తమ ఇష్టాలన్ని వదులుకొని పుస్తకానికే అంకితమవుతారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్​ రాడానికి చాలా రోజులు పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఓ యువకుడు ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్​ స్పందించారు.

young man committed suicide after the exams were cancelled
పరీక్షలు రద్దు అవ్వడంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
author img

By

Published : Mar 18, 2023, 12:22 PM IST

Updated : Mar 18, 2023, 4:04 PM IST

Young man committed suicide in Sircilla: టీఎస్​పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా ఓ యువకుడు ఉద్యోగం రాదేమోనని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ బలవన్మరణానికి పాల్పడిన నవీన్ తండ్రితో ఈ రోజు ఫోన్​లో మాట్లాడారు. తన కుటుంబాన్ని ఆదుకుంటామని అతనికి మంత్రి హామీ ఇచ్చారు. నవీన్​ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖకు ఆయన ఆదేశాలు ఇచ్చారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్​కు చెందిన చిటికె నవీన్​కుమార్ పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నాడు. నవీన్​ హైదరాబాద్​లో హోటల్​ మేనేజ్​మెంట్​ కోర్సు పూర్తి చేశాడు. తను అర్హత కలిగిన అన్ని పోటీ పరీక్షలను రాస్తుండేవాడు. పలు ఉద్యోగాలు సాధించాలని ప్రయత్నించాడు. ఇటీవల జరిగిన గ్రూప్స్​కి ప్రిపేర్​ అవుతూనే సాప్ట్​వేర్​ రంగంలోనైనా జాబ్​ సంపాదించాలని యత్నించాడు.

చివరికి ఏ ఉద్యోగం రాలేనందున మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ వల్ల ఇటీవల నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం మరింత మానసిక క్షోభకు గురి చేసినట్లుంది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోతనకు జాబ్ రాదేమోనని మనస్తాపం చెందిన నవీన్.. నిన్న ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ఉరివేసుకొనే ముందు సూసైట్​ నోట్​ రాసి చనిపోయాడు. ఆ లేఖలో ఉద్యోగం లేని జీవితం వృధా అని రాశాడు. నవీన్​ మృతదేహాన్ని పోలీసులు శవపరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టీఎస్​పీఎస్సీ రద్దు చేసిన పరీక్షలు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న అంశం ప్రశ్నాపత్రాల లీకేజ్​. ఇందులో పలువురు నిందితులుగా ప్రభుత్వం భావించింది. వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తోంది. విచారణలో అనూహ్యమైన విషయాలు బయటపడడంతో కొన్ని పరీక్షలను రద్దు చేసింది. వాటిలో గ్రూప్​ 1 ఒకటి. దీంతో పాటు ఏఈ, డీఏఓ, ఏఈఈ, వెటనరీ, టౌన్​ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్ పరీక్ష తదితర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. వీటిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 18, 2023, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.