తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఉదయాన్నే సిరిసిల్ల బస్ డిపో ముందు బస్సులను అడ్డుకొని ధర్నా చేశారు. డిపోలో ఉన్న 65 బస్సులను బయటకు రానీయకుండా అడ్డుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ధర్నాతో బస్సులున్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బంద్ కారణంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: జేబీఎస్లో ఉదయమే మొదలైన బంద్ ప్రభావం