ETV Bharat / state

ఒక్కొక్కరికి ఉచితంగా 30 పరీక్షలు.. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఆరోగ్య సర్వే..

Telangana Health profile: ఆరోగ్యరంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో...... రాష్ట్రప్రభుత్వం ఈ- హెల్త్‌ ప్రోఫైల్‌కి శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు పైబడిన ప్రజల పూర్తి ఆరోగ్య సమాచారం సేకరించే ప్రక్రియ ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. సుమారు 220 బృందాలు క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలు సేకరించి.. డిజిటల్‌ హెల్త్‌ కార్డ్ రూపొందించనున్నారు..

30 tests free in Telangana Health profile and started in siricilla and mulugu districts

author img

By

Published : Mar 6, 2022, 8:48 AM IST

Telangana Health profile: రాష్ట్రంలో ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించడంలో భాగంగా ఒక్కొక్కరికి గరిష్ఠంగా 30 ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 18ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. ఫలితాల్ని ‘ఈ-హెల్త్‌’ మొబైల్‌ యాప్‌లో పొందుపరుస్తారు. ఈ యాప్‌లో వివరాల్ని చూసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఏకీకృత నంబరు కేటాయిస్తారు. శిక్షణ పొందిన బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక్కో బృందం ప్రతి రోజు 10 కుటుంబాల్లోని సుమారు 40 మంది ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించారు. 1,250 జనాభా గల ఆ గ్రామంలో 23 బృందాలు గత జనవరిలో వివరాలు నమోదు చేశాయి.

సర్వేలో ఏం చేస్తారంటే..?

  • ప్రతి బృందంలో ఇద్దరు ఆశా కార్యకర్తలు, ఒక ఏఎన్‌ఎం ఉంటారు. ఒక్కో బృందం 40 మంది వివరాలు సేకరిస్తుంది.
  • ఆధార్‌ తప్పనిసరిగా నమోదు చేయనున్నారు. వ్యక్తుల సామాజిక వివరాలతో పాటు రక్తనమూనాల్ని సేకరిస్తారు. 18 ఏళ్ల పైబడిన వారి ఆరోగ్య పరిస్థితిపై మదింపు చేస్తారు. ఈ వివరాల నమోదుకు ఇప్పటికే ప్రత్యేక మొబైల్‌యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
  • ప్రతి ఒక్కరికి హిమోగ్లోబిన్‌, రాండమ్‌ బ్లడ్‌షుగర్‌(ఆర్‌బీఎస్‌) పరీక్షలు చేస్తారు. రిస్క్‌ అసెస్‌మెంట్‌ అల్గారిథమ్స్‌ పరిజ్ఞానం ఆధారంగా ఆరోగ్యపరంగా అధికముప్పు ఉన్న వ్యక్తుల్లో 40శాతం మందికి అక్కడికక్కడే బార్‌కోడింగ్‌ చేసి రక్తనమూనాల్ని సేకరిస్తారు.
  • రక్తనమూనాల్ని తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. తర్వాత డయాగ్నోస్టిక్‌ హబ్‌కు తరలిస్తారు. ఫలితాల వివరాలను సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తారు. అలాగే మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ‘తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డ్‌’లో నమోదవుతాయి.
.
.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.