రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా జాన్ ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ అనే వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
వీరు గంజాయిని కరీంనగర్లో గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుక్కొని వేములవాడలో విక్రయించేందుకు వస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. దాదాపు వారి నుంచి 70వేల విలువ గల 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లుగా పట్టణ సీఐ శ్రీధర్ వెల్లడించారు.