పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ యాష్ పాండ్‌కు బూడిద లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది.
చెట్టును వాహనం ఢీకొట్టడం వల్ల లారీ క్యాబిన్లో డ్రైవర్ తల తెగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్ కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రామకృష్ణ... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్